Yuvraj singh: యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు
యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు , టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
15 years of six sixes: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2007లో T20 వరల్డ్ కప్లో, యువరాజ్ T20 క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు బాల్స్ కు ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలోనే ఎవరు సాధించలేనిది యువరాజ్ సింగ్ సాధించాడు. ఈ ఓవర్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేశాడు.
యువరాజ్ సృష్టించిన ఈ చరిత్ర నేటికీ 15 సంవత్సరాలు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన కొడుకు ఓరియన్ కీచ్ సింగ్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని వీడియో చూస్తూ “15 సంవత్సరాల తర్వాత కలిసి దీన్ని చూడటానికి మంచి భాగస్వామిని కనుగొనలేకపోయానని” ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.
ఆ T20 మ్యాచ్లో రాబిన్ ఉతప్ప వికెట్ పడగానే యువరాజ్ బ్యాట్ కు స్వాగతం చెప్పి, బాల్స్ కు ఆరు సిక్సర్లు కొట్టి ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా స్కోర్ 218 పరుగులు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 18 పరుగుల తేడాతో గెలిపొందింది.
Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022