Home / వీక్లీ ట్రెండ్స్
ప్రకృతి ఎంతో సుందరమైనది. చూసే కళ్లు ఆస్వాధించే.. మనసు ఉండాలే కానీ అణువణువునా అందాలు దాగి ఉంటాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, ఆడపిల్ల, కావేవీ కవితకు అనర్హం అని అంటుంటారు. అలానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుచేమలు, సముద్రాలు ఇలా ప్రకృతిలో ప్రతీది కవి హృదయాన్ని చలింపజేస్తాయి. మరియు అలాంటి సుందరమైన దృశ్యాలు, ప్రదేశాలు ఏవైనా సరే ప్రజల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆకాశంలో కనిపించే ఆకృతులు ఎంతో ఆకర్షనీయంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీకు ఎక్కడైనా ఆకాశంలో సముద్రాన్ని చూశారా.. కనీసం ఆకాశాన్ని తాకిన సముద్రాన్ని చూశారా లేదు కదా అయితే ఈ దృశ్యం చూడండి..
మాకు రీమేక్ సినిమాలు వద్దు స్ట్రెయిట్ సినిమాలే కావాలంటూ పవన్ అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. పవన్ హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటన రావడంతో పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవంతో ఫ్యాన్స్ నిరాసచెందుతున్నారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్‌పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి, మెగా ఫ్యామిలీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ దూసుకుపోతున్నారు.
ఇప్పుడంటే లైట్ వెయిట్ ఫోన్లను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం కానీ గత ముప్పై ఏళ్ల ముందు సంగతి ఆలోచించండి. అప్పుడు ఇంత సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయితే మనం ఇప్పుడు చేసే మెస్సేజ్ కు ప్రత్యామ్నాయంగా ఉండే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చి నేటికి సరిగ్గా 30ఏళ్లు అంట. అప్పట్లో వొడాఫోన్ ఇంజినీర్ ఒకరు మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ చేశారట.
పవన్ అభిమానులుకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. రన్ రాజా రన్, సాహోలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.
మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.
కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి. ఎండుద్రాక్షల ప్రయోజనం పొందాలంటే వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ను ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.
ఒకరిపై మరొకరు పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట హాలీవుడ్ తార అంబర్ హెర్డ్, నటుడు జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారట.