Telangana Ministers Portfolio: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. . ప్రభుత్వం ఉత్తర్వులు
Telangana Ministers Portfolio: రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య అభివృద్ధి శాఖలతోపాటు క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను కేటాయించారు. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామికి ముఖ్యమైన గనులు, జియాలజీ, ఫ్యాక్టరీలు, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ మేరకు సీఎస్ కె. రామకృష్ణారావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది.
రాష్ట్ర ఖజానాకు అత్యంత కీలకమైన మైనింగ్ శాఖ బాధ్యతలను మంత్రి వివేక్ కు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. గనుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు కార్మికుల సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణలాంటి కీలక బాధ్యతలు అయనకు అప్పగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సామాజిక నేపథ్యం, గతంలో ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం దృష్ణ్యా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. మరో మంత్రి వాకిటి శ్రీహరికి ఆయన సామాజిక వర్గానికి అనుగుణంగా ఉన్న పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ వంటి శాఖలను కేటాయించారు.