Home / farmers
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.
Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.