Hyderabad: మెట్రోలో బెట్టింగ్.! ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
Hyderabad: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి, దాన కిషోర్ తదితరులు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఓ విడియోను రిలీజ్ చేశాడు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ప్రజల్లో అభద్రతను కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని కలిగించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో ఉంది. కంటెట్ క్రియేట్ చేసిన నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. గత కొన్ని రోజులుగా అన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై అన్వేష్ పోరాటం చేశాడు. హైదరాబాద్ పోలీసులు కూడా సదరు బుల్లితెర నటులపై కేసులను నమోదు చేశారు.
ఇప్పుడు అధారాలు లేకుండా ఏకంగా రాష్ట్ర డీజీపీ, మాజీ సీఎస్ లపై అనుచితంగా పరువుతీసేలా వీడియో చేశాడు. దీంతో అన్వేష్ పై కేసును నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.