Home / Talasani Srinivas yadav
కళామ్మతల్లి ముద్దుబిడ్డ, సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.