Published On:

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాపై బీజేపీ సీరియస్‌

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాపై బీజేపీ సీరియస్‌

BJP serious about MLA Raja Singh Resignation: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాపై ఆ పార్టీ స్పందించింది. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ ప్రకటన విడుదల చేసింది. రాజాసింగ్‌ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రాజాసింగ్‌ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని, పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని పేర్కొంది.

 

రాజాసింగ్‌ తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్ర బీజేపీలో కల్లోలం రేపుతోంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నానని, కానీ, తన మద్దతుదారులను బెదిరించారని తెలిపారు. నామినేషన్‌ వేయడానికి వస్తే వేయనివ్వలేదన్నారు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.

 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడామని, కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కోసం సర్వం ధారపోశానని తెలిపారు. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అని ప్రశ్నించారు. అందుకే పార్టీకి లవ్‌ లెటర్‌ ఇచ్చి వెళ్తున్నానని చెప్పారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అన్నారు. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది (అంటూ లేఖను చూపించారు ఆయన). బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం పోరాడుతూ ఉంటానని రాజాసింగ్‌ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: