Home / ys sharmila
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని.. కావాలంటే జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండని ఆయన సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు.
వైఎస్ షర్మిల మొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి నిశ్చితార్దానికి రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి షర్మిలను సాదరంగా ఆహ్వనించి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తన మద్దతును తెలిపారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్‌తో షర్మిల చర్చించారు.
తమ పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు.