Home / Telangana
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో దాదాపుగా లక్షమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. దీనితో ఆదివారం ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు
దేశ ప్రధాని రాష్ట్రానికి, అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. అయితే, మోదీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చెయ్యదని ఆ ఆలోచన కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు.
వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపటిదినం ప్రధాని రామగుండం రానున్న క్రమంలో కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో మీడియాతో సమావేశమైనారు.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.