Home / Telangana
తెలంగాణలో జరుగుతున్న అవినీతి పై ఢిల్లీ టూర్.
కేసిఆర్ ప్రభుత్వ పాలనపై ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చోటుచేసుకొనిందని కాగ్ కు ఫిర్యాదు చేశారు.
ఓవైపు మునుగోడు ఉప ఎన్నికలు. మరో వైపు భారత జోడో యాత్ర. ఈ రెండింటి నడుమ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ పాదయాత్రను మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీకి విజయం చేకూర్చేలా కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. దీపావళి సెలవు తేదీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆ సెలవును అక్టోబర్ 24న అంటే సోమవారానికి మార్చింది.
ఓ అభ్యర్ధి గుర్తు మార్చిన మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో ఎంపికపై మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు. నేటి సాయంత్రానికి కొత్త ఆర్వో పేరును ఈసీఐ ప్రకటించనుంది.
ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టి పారేస్తున్న పోలీసులు. ప్రలోభాలకు గురి చేస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిక.
రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బెడ్ దొరకదు. స్ట్రెచర్ ఉండదు. అడుగడుగునా సమస్యలే. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి పరిస్థితి.
భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్ల పాటు కొనసాగనున్న కొత్త ఫీజు విధానంలో అత్యధికంగా రూ. 1.60 లక్షలు, అత్యల్పంగా రూ. 45వేలుగా ప్రభుత్వం పేర్కొనింది.