Home / Telangana
Two Senior Maoist Leaders Surrender in Telangana: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు లొంగిపోతున్నారు. తెలంగాణలోనూ మావోయిస్టు ఉద్యమం ప్రభావం గట్టిగానే ఉందని తెలుస్తోంది. ఇటీవల కొంతమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. ఇందులో ప్రధానంగా మాల సంజీవ్ అలియాస్ లెంగు దాదా, సంజీవ్ భార్య పార్వతి అలియాస్ దీనాగా లొంగిపోయారు. కాగా, […]
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారుల నుంచి కీలక సమచారాన్ని సిట్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు మరో కీలక నేతకు సిట్ నోటీసులు పంపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ నిర్ణయించింది. […]
Telangana Rains: వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తక్కువ వర్షపాతం కారణంగా ఖరీఫ్ సాగు మందకొడిగా సాగుతోంది. దీంతో వరి, పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ […]
KTR challenges CM Revanth Reddy: మేడిగడ్డ ఆనకట్టపై చర్చ పెడదామని అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సవాల్‌కు ప్రతిసవాల్‌గా చర్చకు వెళ్తే పారిపోయారని, మళ్లీ చర్చకు పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన దళితబంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దమ్ముంటే మేడిగడ్డ ఆనకట్టపై చర్చకు తాము విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని […]
Local Body Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ సర్కారు ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్కారు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల మెటీరియల్ […]
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భేటీలో ఏపీ సర్కారు నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం […]
Hyderabad Bonalu: సందర్భం ఏదైనా పోకిరీల వికృత చేష్టలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఎవరెలా పోతే మాకెంటి.. తమ పైశాచిక ఆనందం తమదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారు చదువుకున్న చదువు, నేర్చుకున్న జ్ఞానం అంతా బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే బాధ్యత కలిగిన పౌరుడిగా సాయం చేయడం పక్కన పెడితే, కనీసం ఓ వ్యక్తిగా కూడా వ్యవహరించడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన మొహర్రం, బోనాల వేడుకల్లో పోకిరీల వికృతాలు […]
Muralidhar Rao Remand: మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు రిమాండ్ విధించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేటలో ప్లాట్లు గుర్తించారు. అంతేకాకుండా వరంగల్, కోదాడ నగరాల్లో అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, కరీంనగర్ […]
Telangana Student Unions Calls for Colleges and Schools Bandh on july 23: తెలంగాణలో జూలై 23న కళాశాలలు, పాఠశాలలు బంద్ కానున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై 23వ తేదీన పాఠశాలలు, జూనియర్ కళాశాలలను బంద్ చేస్తున్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని, గురుకులాల పాఠశాలలకు […]
BC Reservation: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ సవరించాలని ఇటీవల మంత్రివర్గం నిర్ణయించింది. సెక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు […]