Home / Maharashtra
మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరగుతుండగానే శంభాజీనగర్‌లోని ఘాటీ ఆసుపత్రిలో 24 గంటల్లో ఇద్దరు నవజాత శిశువులు సహా పది మంది రోగులు మరణించారు. దీనిపై శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే X లో ఇలా వ్రాశారు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగులు మరణించడంతో మరణాల సంఖ్య 31కి చేరుకుంది. వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. మొత్తంమీద ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 16 మంది శిశువులు, 15 పెద్దలు మృతి చెందారు.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో రాయ్‌గఢ్ జిల్లాఇర్సల్‌వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి పది మంది మరణించారు. ఈ శిధిలాల కింద 50 మంది దాకా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం హైవేపై ఉన్న హోటల్‌లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.రాష్ట్ర రాజధాని ముంబయ్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
CM KCR: మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వార్కారీలు (విఠల్ స్వామి భక్తులు) మరియు పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భక్తులపై పోలీసులు లాఠీచార్జి జరిపారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా ప్రభుత్వం మాత్రం దీనిని ఖండించింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలకు నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడంతో కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో లంపి చర్మవ్యాధి ( ఎల్ఎస్డి) కలకలం రేపుతోంది. లంపి స్కిన్ డిసీజ్ అనేది ఆవులు మరియు గేదెలలో ఒక అంటు వ్యాధి. ఇది పశువుల మరణాల రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో ఇప్పటివరకు మొత్తం 571 జంతు మరణాలు నమోదయ్యాయి.
ఓ పురుగుమందుల కంపెనీ, మరికొన్ని సంస్థలు నాసిరకం మందులను అందిస్తున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని హింగోలిలో స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు సోమవారం రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరి ప్రత్యేక నిరసన చేపట్టారు.