Home / latest international news
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనా యాజమాన్యంలోని నికెల్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు కారణంగా 13 మంది కార్మికుల మరణించగా పులువురు గాయపడినట్లు పోలీసులు మరియు తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలవబడే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన బహుళజాతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండోనేషియాలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో జరిగిన ఘోరమైన ప్రమాదాలలో ఇది తాజాది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలను ఖలిస్థానీ అనుకూల నినాదాలతో నింపారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారాయణ మందిర్ గోడలపై రాసి ఉన్న నినాదాలను చూపిస్తూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో చిత్రాలను షేర్ చేసుకుంది.
పాకిస్థాన్ లోని సింధ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా మొదటి హిందూ మహిళ మనీషా రోపేటాను నియమించారు.రోపెటా పాకిస్తాన్ యొక్క పితృస్వామ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా, 26 సంవత్సరాల వయస్సులో అధికార పదవిలో నియమితులైన మొదటి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్ బి ఐ) నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ రాష్ట్రం నుండి తప్పిపోయిన భారతదేశానికి చెందిన 29 ఏళ్ల మహిళా విద్యార్థి గురించి సమాచారం ఇస్తే $10,000 వరకు రివార్డ్‌ను ఇస్తామంటూ ఆఫర్ చేసింది.
చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్ యూనివర్శిటీ భవనంలో గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని చెక్ పోలీసులు మరియు నగరం యొక్క రెస్క్యూ సర్వీస్ తెలిపింది. ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా తన షెడ్యూల్ ఈవెంట్లను రద్దు చేసుకుని ప్రేగ్‌కు వెళ్తున్నారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 33 మంది మరణించారు. లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన ఆరు రాకెట్లను అడ్డుకున్నామని, దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
చైనాలోని గన్సు మరియు కింగ్హై ప్రావిన్స్‌లలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా 116 మందికి మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా సుమారుగా 100 మంది మరణించగా మరో 100 మంది శిధిలాల కింద కూరుకుపోయారని గాజాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 100 మందికి పైగా మరణించగా, శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. మరో 20 మంది గాయపడ్డారు.
మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.