Home / International News
:ప్రముఖ వజ్రాల వ్యాపారి నీవర్మోదీ బ్రిటన్‌లో కోర్టు ఫీజులు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదంటూ వాపోతున్నాడు. భారత చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో పిటిషన్ వేశాయి.
సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలను పునఃప్రారంభించేందుకు, ఇరు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఏడేళ్ల ఉద్రిక్తతల తర్వాత, చైనా సహాయంతో ఇరు దేశాలు ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ కు 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
తూర్పుకాంగోలో మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ మిలిటెంట్లు జరిపినజంట దాడుల్లో 40 మందికి పైగా పౌరులు హతమయ్యారని స్థానిక అధికారులు గురువారం తెలిపారు.
:చైనీస్ దౌత్యవేత్తలు తమ దేశాన్ని రక్షించుకోవడానికి తోడేళ్ళతో డ్యాన్స్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. తన తొలి వార్షిక మీడియా సమావేశంలో విదేశాంగ విధానం మరియు యుఎస్-చైనా సంబంధాల గురించి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
లాట్వియా ఈ సంవత్సరం బాగా తాగి నడిపిన డ్రైవర్ల నుండి కార్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇలా స్వాధీనం చేసుకున్నవందలాది వాహనాలతో స్దలాలు నిండిపోవడంతో వాటిని ఉక్రేనియన్ మిలిటరీ మరియు ఆసుపత్రులకు పంపాలని నిర్ణయించుకుంది.
ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు తరలిస్తోంది. 2045 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న ఇండోనేషియా తన కొత్త రాజధాని పర్యావరణ హితంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఇది అటవీనగరంగా ఉంటుందని తెలిపింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు , మహిళా సాధికారత అనేది ఒక ప్రాధాన్యత. ఈ వ్యూహానికి ప్రైవేట్ రంగం గట్టిగా మద్దతు ఇస్తుంది. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు మరియు గుర్తింపును ఇవ్వడానికి అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి.
: ప్రపంచంలోనే అత్యంత వివక్షకు గురయ్యే మహిళలు ఎవరంటే ఆఫ్గనిస్తాన్ మహిళలే అని చెప్పవచ్చు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది.
బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్ చానల్ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు.