Home / CM KCR
Cm Kcr: కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభా వేదికగా మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకుంటే విదేశీ రుణాలపై ఆధారపడాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Cm Kcr )సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రాగానే.. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగంలోనే ఉంచాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో దళితబంధు […]
ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో సీపీఐ జాతీయ నేత డి. రాజా కేంద్రం పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్లతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు. ప్రజల సౌకర్యం కోసం అన్నీ జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు.
Akhilesh Yadav: భాజపా కు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ Akhilesh Yadav అన్నారు. కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. ఖమ్మం సభా వేదికగా అఖిలేష్ ప్రకటించారు. దేశంలో అరాచక పాలన సాగుతుందని.. ఆ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం వచ్చిందని అఖిలేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కాపీ కొడుతుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం కావాలనే […]
యాద్రాద్రి లో పూజల అనంతరం సీఎం కేసీఆర్ ( CM KCR), జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. వారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు.
BRS Meeting: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉంది. ఈ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. బహిరంగసభలో పాల్గొనేందుకు డిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ […]
Brs Meeting: భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికైంది. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయా వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ముఖ్య నేతలంతా యాదాద్రి వెళ్లనున్నారు. అక్కడ దర్శనం అనంతరం […]
MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కాం జరుగుతోందన్నారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అని .. కేసీఆర్ బీహారీ.. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ పైన ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా […]
Mukarram Jah: చివరి నిజాం రాజు.. ముఖరంజా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి చివరి నిజాం మరణించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. చివిరి నిజాం Nizam Family మృతదేహాన్ని మంగళవారం ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. సాయంత్రం మక్కా మసీదులో ప్రార్థన […]
Khammam Politics: ఖమ్మంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కు చెందినవారే కావడం విశేషం. జిల్లాలో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఈ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఉమ్మడి జిల్లా మెుత్తం దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. నేతలు తమకే టికెట్ వస్తుందటూ ఎవరికే వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళా టికెట్ ఆశించి రాకపోతే.. ఏం […]