Home / BRS
బీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు.
దేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది.
BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు.
KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
CM KCR Comments: బాన్సువాడ నియోజకవర్గానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.
MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షం మజ్లిస్ అభ్యర్ధన మేరకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి.