Home / America
అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆ దేశంలోని ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి.. అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది. అయితే, అక్కడి వాతావరణం మాత్రం ఊహించని స్థాయిలో ఇబ్బంది పెడుతోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెనెస్కీ బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కలిసారు. జెలెన్ స్కీని వైట్‌హౌస్‌కి స్వాగతించడంతో పాటు ఉక్రెయిన్‌కు తమ మద్దతును పెంచుతామని జో బిడెన్ హామీ ఇచ్చారు.
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
ప్రకృతి ఎంతో సుందరమైనది. చూసే కళ్లు ఆస్వాధించే.. మనసు ఉండాలే కానీ అణువణువునా అందాలు దాగి ఉంటాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, ఆడపిల్ల, కావేవీ కవితకు అనర్హం అని అంటుంటారు. అలానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుచేమలు, సముద్రాలు ఇలా ప్రకృతిలో ప్రతీది కవి హృదయాన్ని చలింపజేస్తాయి. మరియు అలాంటి సుందరమైన దృశ్యాలు, ప్రదేశాలు ఏవైనా సరే ప్రజల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆకాశంలో కనిపించే ఆకృతులు ఎంతో ఆకర్షనీయంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీకు ఎక్కడైనా ఆకాశంలో సముద్రాన్ని చూశారా.. కనీసం ఆకాశాన్ని తాకిన సముద్రాన్ని చూశారా లేదు కదా అయితే ఈ దృశ్యం చూడండి..
గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై పలు మార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ తాజాగా మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని నెట్టింట ప్రస్తావించారు. ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అన్న ట్రంప్.. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు.
భారతీయులు దేశవిదేశాల్లో తమదైన గుర్తింపును సొంతచేసుకుంటూ దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. అయితే తాజాగా విశాఖ వాసి అమెరికాలో ఓ అరుదైన ఘనత సాధించింది. మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
రోడ్డు మీద ఒకదాని ఒకటి వాహనాలు ఢీ కొంటుంటాయి. మరి ఆకాశంలో నిత్యం అటూ ఇటూ చక్కర్లు కొట్టే విమానాలకు అలాంటి ప్రమాదాలు సంభవించవా అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగిందా. అలాంటి క్రేజీ డౌట్స్ ఉన్న వారి సందేహాలను నిజం చేస్తూ తాజాగా గాల్లో తిరుగాడే రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ దుర్ఘటనలో 6 మంది మృతి చెందారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచల కామెంట్స్ చేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆయన ఆరోపించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. గురువారం అయోవాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను క్రైస్తవులు వారి పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకుంటారు. హాలోవీన్ సందర్భంగా భయానక దుస్తులు ధరించడం, గుమ్మడికాయలు చెక్కడం, భయానక కథలు చెప్పడం, భయానక చలనచిత్రాలు చూడటం మరియు అనేక కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల చనిపోయినవారు తమను గుర్తుపట్టకుండా ఉంటారని వారు విశ్వసిస్తారు. నిజానికి హలోవిన్ సంహైన్ యొక్క పురాతన సెల్టిక్ పండుగ. హాలోవీన్‌ను పంట కాలం ముగింపుగా జరుపుకుంటారు. మరియు సెల్టిక్ క్యాలెండర్ ప్రకారం, వారి సంవత్సరంలో మొదటి రోజు నవంబర్ 1దానికి గుర్తుగా మనం జనవరి 1నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటామో వారు హలోవిన్ ను అలా జరుపుకుంటారు.
సౌరవ్యవస్థలో భగభగమండే ఆ సూర్యుడి గురించి మనం ఎన్నో విన్నాం ఆయన వేడిమి ముందు ఎవరూ నిలువలేరని తెలిసిన విషయమే. కాగా సూర్యుడు కూడా బోసినవ్వులు విరజిమ్ముతాడని. మనల్ని చూసి నవ్వుతున్నట్టు మీరెప్పుడైనా చూశారా.. చూడలేదు కదా అయితే ఇదిగో చూడండి ఇలా నవ్వుతున్నాడు అంటూ నాసా ఒక ఫొటోను విడుదల చేసింది.