Home / Air India plane crash
Wrong Dead Bodies: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే జాతీయులకు సంబంధించి ఓ వార్త సంచలనంగా మారింది. బంధువులకు రెండు మృతదేహాలు తప్పుగా పంపినట్టు బాధిత కుటుంబీకులు న్యాయవాదికి తెలిపినట్టు సమాచారం. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా.. రెండు శవపేటికల్లో ఉన్న మృతదేహాల్లో తేడాలు నమోదయ్యాయి. ఈ రెండు మృతదేహాల అవశేషాలు బాధిత కుటుంబాలతో సరిపోలేదని తెలుస్తోంది. అయితే బాధిత కుటుంబాల తరపున న్యాయవాది జేమ్స్ హేలీ […]
Union Minister Rammohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు. నివేదికను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు […]
Ahmedabad Plane Crash Preliminary Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. దీనిపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీల నివేదికను సమర్పించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించిన ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. […]
Ahmedabad Plane Crash Preliminary Report submitted to Centre Govt.: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు విశ్లేషణ, దర్యాప్తు ఆధారంగా ఏఏఐబీ ప్రాథమిక నివేదిక రూపొందించింది. దాన్ని మంగళవారం కేంద్ర పౌరవిమాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి నివేదికను అధికారులు బయట పెట్టలేదు. […]
Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో హాస్టల్ పై కుప్పకూలిపోయింది. ఒక్క ప్రయాణికుడు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. హాస్టల్ లో ఉన్న 35 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. […]
Air India plane crash: ఎయిర్ ఇండియా విమానం AI 171 ప్రమాద బాధితులకు ఆర్థికసాయం అందించేలా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ బోర్డును అనుమతి కోరింది. గురువారం జరిగిన కీలక భేటీలో ప్రతిపాదన తీసుకొచ్చినందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సభ్యులను అభినందించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. సమావేశానికి టాటా ట్రస్ట్ నామినీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్‌సింగ్ హాజరయ్యారు. ట్రస్ట్‌కు రూ.500 కోట్లు కేటాయించేలా అనుమతులు కోరింది. వాస్తవానికి […]
Air India plane crash: ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. విషయాన్ని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. ముగ్గురు అధికారుల్లో ఎయిర్‌లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ నుంచి […]
Ram mohan Naidu review on Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘటనను పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ప్రమాదంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ సర్కారు, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే మంటలు […]
Vishwash Kumar Ramesh : అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో విశ్వాస్ కుమార్ రమేశ్ బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. తాను విమానం నుంచి దూకలేదని పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందని తెలిపారు. తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడినట్లు చెప్పారు. అందుకే […]
Air India : అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించినట్లు వస్తున్న ఊహాగానాలను ఎయిర్ ఇండియా కొట్టిపడేసింది. విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. దొరికినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ప్రమాదానికి గురైన విమాన శిథిలాల […]