Published On:

IPL 2025 : ముంబయి లక్నో మధ్య కీలక పోరు.. టాస్ గెలిచిన లక్నో

IPL 2025 : ముంబయి లక్నో మధ్య కీలక పోరు.. టాస్ గెలిచిన లక్నో

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈ రోజు రెండు మ్యాచులు జరగనున్నాయి. రివేంజ్ విక్ కొనసాగుతుండటంతో మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, లక్నో జట్లు తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మూడు, నాలుగో స్థానంలో చేరుకుంటాయి.

 

ఈ రెండు జట్లు ఈ నెల 4వ తేదీన 16వ మ్యాచులో పోటీపడ్డాయి. లక్నో జట్టు 12 పరుగుల తేడాతో ముంబయిపై విజయ ఢంకా మోగించింది. దీంతో ఓటమికి ముంబయి ఆదివారం పగ తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది. మ్యాచులో విజయం సాధించడం రెండు జట్లకు అత్యంత కీలకంగా మారనుంది. మ్యాచులో ఓడిన జట్టుకు ప్లే ఆఫ్ కష్టతరం కానుంది. రెండు జట్లు విజయం కోసం పోటీ పడనుండగా, మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.

 

ముంబయి జట్టు : ర్యాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్, రోహిత్ శర్మ ఉన్నారు.

లక్నో జట్టు : రిషభ్ పంత్, ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ బదోని ఉన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: