IND vs PAK: క్రికెట్లో బరిలో మహా సంగ్రామం.. నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్
ప్రపంచ టోర్నీకే వన్నెతెచ్చే అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత్ సమరానికి సిద్ధమయ్యింది. బరిలోకి దిగి ఫేస్ టు ఫేస్ తలపడనున్నాయి ఇరు జట్లు. ఈ పోరుకు మెల్‌బోర్న్ మైదానం వేదిక కానుంది.
IND vs PAK: ప్రపంచ టోర్నీకే వన్నెతెచ్చే అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత్ సమరానికి సిద్ధమయ్యింది. బరిలోకి దిగి ఫేస్ టు ఫేస్ తలపడనున్నాయి ఇరు జట్లు. ఈ పోరుకు ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్ మైదానం వేదిక కానుంది. లక్షమంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్న ఈ మెగావార్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.
గత ఏడాది జరిగిన పరాభవానికి పగతీర్చుకోవాలని ఒక జట్టు అనుకుంటుంటే ఫామ్ ఉన్నాం ఇదే స్పీడులో టోర్నీ కైవసం చేసుకోవాలని మరో జట్టు భావిస్తోంది.
గత సంవత్సరం పొట్టి ప్రపంచకప్ సూపర్-12 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడి ఇంటి బాట పట్టిన టీంఇండియా ఈ సారి ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నది. ఇకపోతే ఎప్పటి లాగానే భారత జట్టు బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతుండగా.. బౌలింగే తమ ఆయుధంగా పాక్ రంగంలోకి ప్రవేశిస్తుంది. కాగా రోహిత్ సేన టాపార్డర్‌కు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్‌తో ముప్పు పొంచి ఉందనే చెప్పవచ్చు. ఐసీసీ టోర్నీల్లో మెరుగైన రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీతో పాటు రోహిత్, రాహుల్, సూర్యకుమార్ కలిసికట్టుగా కదం తొక్కితే కనుక నా సామిరంగ భారత్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్