Nagababu: ప్రైమ్9 వెబ్ సైట్ ను ప్రారంభించిన మెగాబ్రదర్ నాగబాబు
ప్రైమ్9 హెడ్ ఆఫిస్ లో జరిగిన ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగిగా సినీనటుడు నాగబాబు హజరయ్యారు. ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసి, ప్రైమ్9 టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Hyderabad: ప్రైమ్9 హెడ్ ఆఫిస్ లో జరిగిన ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగిగా సినీనటుడు నాగబాబు హజరయ్యారు. ప్రైమ్9 డిజిటల్ వెబ్ సైట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసి, ప్రైమ్9 టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమన్న ఆయన, మీడియా నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మద్య మీడియా వారదిలా పనిచేయాలని కోరారు.
రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని లేదా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుందని నాగబాబు విశ్వాసం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ అక్టోబర్ నెలనుంచి ఏపీలో విస్తృతంగా పర్యటించి జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారని ఆయన తెలిపారు. ప్రతీనెలా వందలాది సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని నాగబాబు పేర్కొన్నారు.