Last Updated:

Kuna Srisailam Goud: కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. కూన శ్రీశైలం గౌడ్

కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎద్దేవా చేసారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు.

Kuna Srisailam Goud: కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. కూన శ్రీశైలం గౌడ్

Hyderabad: కుత్భుల్లాపూర్ కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎద్దేవా చేసారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ కు ఊడిగం చేసినోడు ఎమ్మెల్సీ గా ఉన్నాడని, నరేంద్రమోదీ, బండి సంజయ్, బీజేపీ పై విమర్శలు చేయడం తప్ప, వాళ్లకు తెలిసింది ఏమీ లేదని విమర్శలు చేశారు.

బిడ్డా వివేక్ బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తే ప్రజలు నీ తాట తీస్తారని మండిపడ్డారు. 168 సర్వే నెంబర్ లో పేదలకు రిజిస్ట్రేషన్ చేయించని దద్దమ్మ స్థానిక ఎమ్మెల్యే అని, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. జగద్గిరిగుట్టలో బస్ డిపో కట్టిస్తా అని, 5 ఏళ్ళు గడిచినా ఇంకా దాన్ని కట్టలేదని, సిగ్గు, లజ్జా ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శ్రీశైలం గౌడ్ సవాల్ చేసారు.

ఇవి కూడా చదవండి: