Home / GST
ఏప్రిల్ నెల జీఎస్టి వసూళ్లు దుమ్ము రేపాయి. ఏకంగా రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 12.4 శాతం వసూళ్లు పెరిగాయి. ఆర్థికమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకరం దేశీయ లావాదేవీలు 13.4 శాతం పెరిగిపోవడంతో పాటు దిగుమతులు 8.3 శాతం వరకు పెరిగాయి. జీఎస్టీ రిఫండ్ తర్వాత నికరంగా ఏప్రిల్ నెలలో రూ. 1.92 లక్షల కోట్లుగా తేలింది.
2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.12 లక్షల కోట్లకు పైగా జిఎస్టి ఎగవేతకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 71 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పన్ను ఎగవేత మొత్తం మరియు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జారీ చేయబడిన షోకాజ్ నోటీసుల సంఖ్యపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
నకిలీ బిల్లింగ్ ద్వారా పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను నెట్వర్క్ ( జీఎస్టీఎన్ )ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి చేర్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీఎస్టీఎన్ పరిధిలో పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి మరింత అధికారం లభించనుంది
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్‌స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకు సంబంధించి జీఎస్టీ నష్టపరిహారంగా కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు రూ. 17,000 కోట్లు విడుదలచేసింది.
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో భారీ రాబడిని కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలకు గాను రూ. 1,51,718 కోట్లు వసూలైన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రూ.21,000 కోట్ల రూపాయల మేరకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లించనందుకు బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది.
వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.