Last Updated:

Swiggy layoffs: స్విగ్గీలో ఊడుతున్న ఉద్యోగాలు.. మరోసారి 380 మంది ఔట్

Swiggy layoffs: స్విగ్గీలో ఊడుతున్న ఉద్యోగాలు.. మరోసారి 380 మంది ఔట్

Swiggy layoffs: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్ధ ‘స్విగ్గీ’ (Swiggy) ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 380 మంది ఉద్యోగులను తొలగించింది. అత్యంత క్లిష్ట పరిస్థితి ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున కంపెనీ లు లేఆఫ్ లను ఎంచుకున్నాయి.

ఇందులో భాగంగానే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ లాంటి కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. తాజాగా ఇదే బాటలతో నడిచింది స్వీగ్గీ.

సంస్థ పునరుద్ధరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని స్వీగ్గీ సీఈఓ వెల్లడించారు.

ఈ మేరకు తొలిగించిన ఉద్యోగులకు ఈ మెయిల్స్ చేశారు. టాలెంట్ ఉన్న 380 మంది ఉద్యోగులను తొలగించడం బాధగా ఉందని పేర్కొన్నారు.

చాలా రివ్వ్యూలు చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు మెయిల్ లో తెలిపారు.

6 నుంచి 3 నెలల జీతం

ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్ డిపార్ట్ మెంట్స్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమైనట్టు సమాచారం. ఐపీఏ కు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి కంపెనీ ఈ చర్యలు చేపట్టిందని తెలిసింది.

ఉద్యోెగుల హైరింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశామని, ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వ్యవహరించి ఉండాల్సిందని కంపెనీ పేర్కొంది.

బాధిత ఉద్యోగులకు ఉద్యోగి పదవీకాలాన్ని బట్టి మూడు నుంచి ఆరు నెలల జీతం పరిహారం లభిస్తుందని, కనీసం మూడు నెలల వేతనాల చెల్లింపు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

అదే విధంగా రాబోయే మూడు నెలలు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ పాటు కొన్ని ఖర్చులు రీయింబర్స్ చేస్తామని తెలిపింది.

ఆ విక్రయాలు క్లోజ్

మాంసం విక్రయాల కోసం స్విగ్గీ(Swiggy) ప్రవేశపెట్టిన ప్రత్యేక విభాగాన్ని మూసి వేస్తున్నట్టు సీఈఓ ప్రకటించారు. ఇకపై మాంసం విక్రయాలు ఇన్ స్టా మార్ట్ ద్వారా జరుగుతాయని స్పష్టం చేశారు.

అదే విధంగా కొత్త విభాగాల్లో తమ పెట్టబడులు కొనసాగుతాయని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న కొన్ని కొత్త వర్టికల్స్‌పై కూడా కంపెనీ దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అత్యంత చాలెంజ్ గా మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నష్టాల బాటలో స్విగ్గీ

ఉద్యోగాల తొలగింపులో భాగంగా గత ఏడాది అక్టోబర్ స్విగ్గీ రివ్వ్యూ నిర్వహించింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులకు రేటింగ్ ద్వారా తమ పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం ఇచ్చింది.

దీంతో ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి నెలకొన్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. మరో వైపు స్విగ్గీ నష్టాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.

2021 లో రూ. 1617 కోట్లు నష్టపోగా , గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపు రూ. 3628 కోట్ల నష్టాలను చవి చూసింది స్విగ్గీ.

అందుకోసమే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. స్విగ్గీ (Swiggy) తన పోటీ సంస్థ జుమాటో తో పోలిస్తే తన మార్కెట్ వాటాను సైతం కోల్పోతోందని బ్రోకరేజ్ సంస్థ జఫ్రీచ్ గతంలో తెలిపింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/