Last Updated:

Delhi Anjali Case : సంచలనంగా మారిన డిల్లీ అంజలి కేసులో… మరో ట్విస్ట్ ?

Delhi Anjali Case : సంచలనంగా మారిన డిల్లీ అంజలి కేసులో… మరో ట్విస్ట్ ?

Delhi Anjali Case : ఢిల్లీలో జరిగిన అంజలి యాక్సిడెంట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని కారుతో గుద్ది 12 కి.మీ. దూరం అలాగే ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజా సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ఆందోళనతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కాగా ఈ కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

మృతురాలు అంజలి, ఆమె స్నేహితురాలు నిధి… హోటల్ లో గొడవపడ్డారని సిబ్బంది చెప్పారు. న్యూ ఇయర్ పార్టీలో వారు డ్రగ్స్ వినియోగించారని తెలిపారు. వారితో ముగ్గురు అబ్బాయిలు ఉన్నారని, వారూ అదే హోటల్ లో వేరే రూమ్ బుక్ చేసుకున్నారని చెప్పారు. హోటల్ లో గొడవ పడుతున్న యువతులిద్దరినీ బయటికి వెళ్లిపోవాల్సిందిగా హోటల్ సిబ్బంది కోరారు. దీంతో వారు గొడవ పడుతూనే హోటల్ బయటికి వచ్చారు. అక్కడ కూడా గొడవ పడ్డారు. హోటల్ బయట గొడవ పడుతూ ఒకరినొకరు నెట్టుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

అయితే బాధితురాలిని అత్యాచారం చేసి ప్రమాదంగా చిత్రీకరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అంజలి అవయవాలకు అంతర్గత గాయాలేవీ లేవని పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదంలోనే ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. తమ కుమార్తె శరీరం పూర్తిగా నగ్నంగా ఎందుకు ఉందని, ఇది ఏ తరహా ప్రమాదమని నిలదీశారు. పోలీసులు మృతదేహాన్ని సరిగా చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం జరగాలంటూ రోదిస్తున్నారు..

అసలేం జరిగింది అంటే ?

ఢిల్లీలోని కంజావాలా ప్రాంతంలో నూతన సంవత్సరం రోజున అంజలి, నిధి వెళ్తున్న స్కూటీని కారుతో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. స్కూటీ నుంచి కిందపడ్డ నిధి స్వల్ప గాయాలతో తప్పించుకోగా.. అంజలి కాలు కారు యాక్సిల్ లో ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిందని తెలిసినా… కారులో ఉన్న వారు వాహనం ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనతో భయపడిన నిధి ప్రమాద స్థలం నుంచి పారిపోయింది. సుమారు 12 కి.మీ ఈడ్చుకెళ్లిడంతో యువతి ప్రాణాలు కోల్పోయి రహదారిపై నగ్న స్థితిలో కనిపించింది. పోలీసులు తొలుత దీన్ని రోడ్డు ప్రమాదమని పేర్కొనగా… ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో గుద్ది ఈడ్చుకెళ్లారని, గంట పాటు రోడ్డుపై వాహనాన్ని అలాగే నడిపారని దీపక్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. రోడ్డులో పోలీస్‌ బారికేడ్లు చూసి కారు యూటర్న్‌ తీసుకోవడం తాను చూశానని ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ చెప్పాడు. ఆ సమయంలో కారు ముందు భాగంలో యువతి మృతదేహం ఉందని తెలిపాడు. బాధితురాలిని కారుతో ఈడ్చుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

హత్యాచార ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసం ముందు ఆప్ నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. నిందితుల్లో ఒకరు బీజేపీ నేత అని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ స్పందించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితులకు కోర్టు 3 రోజుల రిమాండ్‌ విధించింది. ఘటన జరిగిన రోజు మద్యం తాగి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు.

యువతి శరీరం కారు ముందు భాగంలో ఇరుక్కుపోయిందని తెలియక.. అలాగే వాహనాన్ని నడిపినట్లు వారు పోలీసులతో చెప్పారు. కారు ఢీకొనగానే యువతి కాలు యాక్సెల్‌లో ఇరుక్కుపోయింది. కారు అలాగే ముందుకు వెళ్లడంతో అంజలి శరీరం 12 కి.మీ. మేర రోడ్డంతా ఈడ్చుకుపోయి ఛిద్రమైంది. ఈ ఘటన పట్ల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి: