Last Updated:

Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై కీలక తీర్పు

ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై కీలక తీర్పు

Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం.. ప్రధాన మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు 5 గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ప్రధానం ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలనీ స్పష్టం చేసింది.

 

ప్రస్తుత నియామక విధానం రద్దు( Election Commissioners)

ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.ఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. సీఈసీ నియామకాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.

వీరి నియామకాల కోసం పార్లమెంట్‌ కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీం సూచించింది.

అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ.. సీఈసీ ల తొలగింపు లాగే ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

 

 

పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలు

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది.

రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని.. ఎన్నికల కమిషన్‌ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది.