Last Updated:

PM Modi: మోదీ, యోగిలను చంపేస్తానంటూ ఫోన్ కాల్.. అలర్ట్ అయిన పోలీసులు

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

PM Modi: మోదీ, యోగిలను చంపేస్తానంటూ ఫోన్ కాల్.. అలర్ట్ అయిన పోలీసులు

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు మద్యం మత్తులో ఈ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

గతంలోనూ అనేక సార్లు బెదిరింపులు(PM Modi)

సోమవారం యూపీ పోలీసుల హెల్ప్ లైన్ 112 కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ప్రధాని, సీఎంలను చంపేస్తానని బెదిరించాడు. తన పేరు అరుణ్ కుమార్ అని, గోరఖ్ పూర్ లోని భుజౌలి కాలనీ నివాసినని చెప్పాడు. దీనితో అలర్ట్ అయిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే గతంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీని హత్యకు ఓ గుర్తు తెలియని వ్యక్తి కుట్రపన్నాడు. నోయిడాలోని ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్​ ఆఫీసర్​కు.. ఏప్రిల్​ 3న రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్​లో మోదీ, యోగి ఆదిత్యనాథ్​లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో మంగళవారం సాయంత్రం ఆ మీడియా సంస్థ ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. singhkartik78107@gmail.com అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నారు. మరోసారి ఏకంగా ఎన్ఐఏకే ప్రధాని మోదీను చంపేస్తామని ఈ-మెయిల్ వచ్చింది. ముంబైలో ఉన్న ఎన్‌ఐఏ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్‌ రావడం విశేషం. 20 మంది స్లీపర్‌సెల్స్ మోదీని హత్య చేయడానికి రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు.