Home / తప్పక చదవాలి
విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సెనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటి) దీనికి సంబంధించి విధి విధానాలను విడుదల చేసింది.
ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరావు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కందుల దుర్గేష్ కొద్దిరోజులకిందట ఏపీ క్యాబినెట్లో పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదు అవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నగరంలో ట్యాంకర్ల ముందు చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి.
మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్... నీట్ పరీక్షలను రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నీట్ పరీక్షలపై ఒక వైపు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. అయితే పరీక్షలు ఎందుకు రద్దు చేయడం లేదో విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వివరించారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి
నిబంధనలకు విరుద్ధంగా ఉందని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్డిఏ అధికారులు కూల్చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టారు. 16వ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచి కొట్టాయి. ఇక మన దేశంలో ఈ వేసవిలో వడదెబ్బకు సుమారు 143 మంది ప్రాణాలు కోల్పోతే.. 41వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గురువారం నేషనల్ సెంటర్ ఫర్ డీసీస్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తాజా గణాంకాలను విడుదల చేసి ఈ వివరాలు వెల్లడించింది.
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.