Mohammed Siraj Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి టీమ్ ఇండియా జెర్సీని బహుకరించిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన సిరాజ్‌ను రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
Mohammed Siraj Meets Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన సిరాజ్‌ను రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా సిరాజ్ ముఖ్యమంత్రికి టీమ్ ఇండియా జెర్సీని బహుకరించారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇటీవల వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టోర్నీకి ఎంపికైన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో సిరాజ్ ఉన్నాడు. ఆడిన మూడుమ్యాచుల్లో ఒక వికెట్ సాధించాడు.