Home / Telangana secretariat
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధనకోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. డా.బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో మొత్తం ఆరు ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు.
నేడు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం నుంచి పూజలు, హోమాలు మొదలయ్యాయి. దీంతో వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.