Last Updated:

KTR : తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్ : కేటీఆర్

KTR : తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్ : కేటీఆర్

KTR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేట‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాక్‌పాట్‌లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. బీఆర్ఎస్ కోసం ర‌క్తం ధార‌పోస్తున్న అన్న‌ద‌మ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల‌కు హృద‌య‌పూర్వ‌క నమస్కారాలు. ఇది అరుదైన సంద‌ర్భం అన్నారు. తెలుగు రాజ‌కీయాలు తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ క‌లిపి చూస్తే మ‌న చ‌రిత్ర సుదీర్ఘ‌మైన‌దని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

 

 

దేశంలో ద‌శాబ్దాల పాటు తెలుగువారిని మ‌ద్రాసీలు అని పిలిచేవారన్నారు. నంద‌మూరి తార‌క‌రామారావు టీడీపీ స్థాపించి తెలుగువారి గొప్ప‌త‌నాన్ని ఎలుగెత్తి చాటారని కొనియాడారు. ఆ త‌ర్వాత దేశంలో తెలంగాణకు ప్ర‌త్యేక అస్తిత్వం, పౌరుషాల గ‌డ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయ‌కుడు కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేరు తీసుకోవడానికి ప్ర‌త్యేక సంద‌ర్భం ఉందని, రెండు పార్టీలు మాత్రమే విజ‌య‌వంతంగా 25 ఏండ్ల పైచిలుకు ప్ర‌స్థానాన్ని కొన‌సాగించాయన్నారు. టీడీపీ, బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లోంచి పుట్టిన పార్టీ గులాబీ అని కేటీఆర్ తెలిపారు.

 

 

2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారని, అప్పుడ ఆయనకు 46 ఏండ్ల వ‌య‌సు అన్నారు. రాజ‌కీయ పార్టీ పెట్టాలంటే దుస్సాహాసం ఉండాలన్నారు. నాడు 100 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన‌ కాంగ్రెస్, ఎన్డీఏ ప్ర‌భుత్వం బీజేపీ ఒక వైపు ఉన్నారన్నారు. మూడో వైపు అదే ఎన్డీఏకు క‌న్వీన‌ర్‌గా ఉంటూ ఏపీ సీఎంగా ఉంటూ ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ చంద్ర‌బాబు ఒక వైపు ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ అంశం 30 ఏండ్లు మ‌రుగున‌ప‌డ్డ అంశం అన్నారు. 1971లో తెలంగాణ ప్ర‌జాస‌మితి పార్టీ 11 ఎంపీలు గెలిచి కాంగ్రెస్‌లో క‌లిపోయిందన్నారు. తెలంగాణ ప్ర‌జా స‌మితి కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో తెలంగాణ స‌మాజ‌నికి న‌మ్మ‌కం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో 2001లో గులాబీ జెండా ఎగురవేసి ఒక్క‌డిగా బ‌య‌ల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మ‌హా నాయ‌కుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: