CS Shantakumari : సీఎస్ శాంతకుమారి సంచలన నిర్ణయం.. త్వరలో వీఆర్ఎస్

Telangana CS Shantakumari : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన సర్వీసుకు వీఆర్‌ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. శాంతకుమారి వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకున్నా నిజానికి శాంతికుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ తీసుకోవాలనుకోవడంతో మరింత ముందుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందినవారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణారావు కూడా వచ్చే ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కి అలాట్ కావడంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు.