National Integration Day: తలక్రిందులుగా జాతీయజెండా.. ఆర్ఎస్సై సస్పెన్షన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో జాతీయ జెండా తిరగబడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేయగా తలక్రిందులుగా ఎగిరింది.

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో జాతీయ జెండా తిరగబడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేయగా తలక్రిందులుగా ఎగిరింది.
జాతీయ జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథికి ఒకదానికి బదులుగా పొరపాటున ఇంకొక దారంను ఆర్ఎస్సై సదానందం అందించడంతో ఘటనకు బాధ్యుడిగా ఆర్ఎస్సై ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ జె.సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పి చైర్మన్ జక్కుశ్రీ హర్షిణి,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, ఎస్పీ సురెందర్ రెడ్డి, జేసీ స్వర్ణలత, ఆడిషినల్ కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.