Last Updated:

Revanth Reddy : ఆ భూముల వ్యవహారంపై ఏం చేద్దాం.. మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy : ఆ భూముల వ్యవహారంపై ఏం చేద్దాం.. మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న వెల్లడించింది. హెచ్‌సీయూ, ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూమార్పిడి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో యూనివర్సిటీ అధికారులు చేసిన సంతకాలతో కూడిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. టీజీఐఐసీకి అప్పగించిన భూముల విషయంలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విరుద్ధమైన ప్రకటన చేయడం వెనుక ఏం జరుగుతోందనే అంశంపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

అధికారులు, కార్మికులపై దాడి..
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పని జరుగుతుండగా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతరులు అక్కడికి చేరుకుని అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: