Last Updated:

Lok sabha: ఇంకోసారి అలాంటి టీ షర్ట్ ధరించి సభకు రాకండి.. స్పీకర్ వార్నింగ్

Lok sabha: ఇంకోసారి అలాంటి టీ షర్ట్ ధరించి సభకు రాకండి.. స్పీకర్ వార్నింగ్

Speaker Om Birla Serious On Opposition MP’s in Lok sabha: లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభకు కొంతమంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలు టీషర్టులు ధరించి రావడంతో స్పీకర్ అభ్యంతరం వ్యకం చేశారు. ఇంకోసారి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీషర్లు ధరించవద్దని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే టీ షర్టులు ధరిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

 

సభల నిబంధనలు, విధానాలను అనుసరించడంతో పాటు సభ్యులు గౌరవంగా వ్యవహరించి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని ఓం బిర్లా తెలిపారు. అయితే కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది సభ్యులు నియమాలు పాటించడం లేదని, ఈ విధానం సరైంది కాదన్నారు. డ్రెస్ విషయంలో చాలా హుందాగా వ్యవహరించాలని, నినాదాలతో ఉన్న దుస్తులు ధరించడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.