Stones in woman Stomach: కడుపులో 570 రాళ్ళు.. ఖంగుతిన్న డాక్టర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆమె కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రికి తరలించారు.

Stones in woman Stomach: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆమె కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ఆమెకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ స్కానింగ్‌లో వచ్చిన రిపోర్ట్స్ చూసి డాక్టర్లు ఖంగుతిన్నారు . ఆమె గాల్ బ్లాడర్‌లో భారీ గా రాళ్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రి లో జాయిన్ అయింది.ఆమెకు ల్యాబ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు . స్కానింగ్ లో ఏకంగా 570 రాళ్లను ఆమె గాల్ బ్లాడర్‌లో కనిపెట్టారు వైద్యులు.
అరుదైన శస్త్ర చికిత్స..(Stones in woman Stomach)
ల్యాబ్ రిపోర్టులు చుసిన వెంటనే ఆమెకు సర్జరీ చేశారు వైద్యులు. శస్త్ర చికిత్స చేసి ఆ రాళ్లన్నింటినీ బయటకు తీశారు.గాల్ బ్లాడర్‌లో ఉన్న 570 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో గాల్ బ్లాడర్ నుంచి రాళ్లు తొలగించడం ఇదే మొదటి సారి అయిన వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Iran President Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ
- Wardhannapet Govt Hospital: వర్ధన్నపేట ఆసుపత్రిలో దారుణం ..గర్భిణీకి నర్సులు డెలివరీ.. శిశువు మృతి