Last Updated:

Munugode by poll: తెరాసకు జలక్ ఇస్తున్న కుల సంఘాలు

మునుగోడు ఉప ఎన్నికల అధికార పార్టీ తెరాసకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మునగకుండా ఆ పార్టీకి విజయం తధ్యంగా మారింది. దీంతో పార్టీలోని కీలక శ్రేణులు మునుగోడులోనే మకాం వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు

Munugode by poll: తెరాసకు జలక్ ఇస్తున్న కుల సంఘాలు

Chowtuppal: మునుగోడు ఉప ఎన్నికల అధికార పార్టీ తెరాసకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మునగకుండా ఆ పార్టీకి విజయం తధ్యంగా మారింది. దీంతో పార్టీలోని కీలక శ్రేణులు మునుగోడులోనే మకాం వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రచారంకు వస్తున్న తెరాస నేతలకు కుల సంఘాలు జలక్ ఇస్తున్నాయి. హామీలు నెరవేర్చకపోతే తమ వర్గం ఓట్లు పడవంటూ రెండు వేర్వేరు సంఘాలు చౌటుప్పల్ కేంద్రంగా పేర్కొన్నాయి.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆర్యవైశ్య సంఘం తీర్మానం చేసింది. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయవద్దని నిర్ణయించినట్లు తెలిపింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించి నాలుగేళ్లయినా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయమంటూ చౌటుప్పల్‌లో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి అధికార పార్టీకి వెన్నులో చలి పుట్టేలా చేశారు.

ఆరెగూడెంకు చెందిన గౌడ కులస్ధులు మంత్రి మల్లారెడ్డి నర్మగర్భంగా ఓట్ల పడవంటూ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం గౌడ కులస్తులకు చెందిన ఓ దేవాలయం నిర్మాణానికి రూ.12 లక్షలు ఇస్తామని మంత్రి పేర్కొనివున్నారు. అయితే రూ. 2 లక్షలు ఇచ్చిన మంత్రి వర్గీయులు ఎన్నికలు అయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామనడంతో గౌడ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా డబ్బులు ఇవ్వాలని, ఎన్నికల తర్వాత ఎవరూ రారని మంత్రిని గౌడ సంఘ నాయకులు నిలదీశారు. ఒక విధంగా ఒప్పుకొన్న మొత్తం ఇవ్వకపోతే ఓట్లు పడేది కష్టమేనని మంత్రి వర్గీయులతో కుల సంఘ నేతలు పేర్కొన్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: Munugode by poll: దత్తత తీసుకొనే దమ్ము టీఆర్ఎస్ అభ్యర్ధికి లేదా? భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి

ఇవి కూడా చదవండి: