Last Updated:

mint leaves: పుదీనాతో ఆందోళన మాయం..!

పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా..

mint leaves: పుదీనాతో ఆందోళన మాయం..!

Mint: పుదీనాను ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అందరి ఇళ్లల్లోనూ విరివిగా లభిస్తుంది మరియు అన్ని వంటల్లోనూ దీనిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. అంతేకాదండోయ్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పుదీనా లభిస్తుంది. ఈ ఆకుకూరలో కేలరీలు తక్కువ, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, డీ,బీ కాంప్లెక్స్‌ విటమిన్లు ఈ పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి.

  • ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక ఐరన్‌, పోటాషియం, మాంగనీస్‌ వంటివి లభిస్తాయి.
  • పుదీనా శరీరంలోని రక్తం శాతం పెరగడానికి మరియు మెదుడు పనితీరు మెరుగడడానికి ఉపయోగపడుతుంది.
  • మాంసాహారంలో, కూరల్లో, జ్యూస్‌, టీల వంటి వివిధ ఆహారాల రూపంలో పుదీనాను తీసుకోవటం ఎంతో ఉత్తమం. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉండి, కడుపులో వికారం లాంటి లక్షణాలు ఉండవు.
  • పుదీనా ఓ మంచి ఎనర్జీ బూస్టర్‌. ఊపిరితిత్తులకు చాలా మంచిది. దగ్గు నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగిస్తుంది.
  • పుదీనాలోని ఫ్లేవర్‌ వల్ల ఒత్తిడి, తలనొప్పి, ఆందోళనలు తగ్గుతాయని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా మింట్‌ రూపంలో చాక్లెట్స్‌, చూయింగ్‌ గమ్‌ నములుతుంటే ఆందోళన తగ్గి, మెదడు చురుగ్గా ఉన్నట్లు అనిపిస్తుందట.
  • పుదీనాతో నోటి దుర్వాసన పోతుంది.
  • పుదీనా వల్ల రిఫ్రెషింగ్‌ అవ్వటంతో పాటు బరువు తగ్గటంతో పాటు దురదల నుంచి ఉపశమనం కలిగుతుంది
  • పుదీనాను పేస్ట్‌లా చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇదీ చదవండి: హైదరాబాదీ హలీమ్ కు అరుదైన అవార్డ్.. అదేంటంటే..?

ఇవి కూడా చదవండి: