Bamboo Rice: వందేళ్లకు ఒకసారి వచ్చే వెదురు బియ్యం… తిన్నోళ్లకు వందేళ్లు..!
సాధారణంగా మనం అన్నం తింటుంటాం కాబట్టి దాన్ని స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదని అనుకుంటుంటాం. వరి బియ్యంతో చేసిన అన్నం ఒక్కటే కాకుండా ఇదే తరహాలో వెదురు బియ్యంతో కూడా అన్నం వండుకోవచ్చటా.. వెదురు బియ్యమా అవెక్కండుటాయి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా... అయితే ఈ కథనంపై ఓ లుక్కెయ్యండి.
Bamboo Rice: సాధారణంగా మనం అన్నం తింటుంటాం కాబట్టి దాన్ని స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదని అనుకుంటుంటాం. అయితే మన చుట్టూ ఉన్న సమాజం రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటుంది. వరి బియ్యంతో చేసిన అన్నం ఒక్కటే కాకుండా కొర్రలు, సామలు, ఒరికలు, సజ్జ అన్నం, ఇలా చాలా రకాలుగా అన్నం తయారు చేసుకుంటున్నాం. కానీ ఇదే తరహాలో వెదురు బియ్యంతో కూడా అన్నం వండుకోవచ్చటా.. వెదురు బియ్యమా అవెక్కండుటాయి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా… అయితే ఈ కథనంపై ఓ లుక్కెయ్యండి
ప్రకృతిలో చాలా పదార్థాలు మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారంగా ఉపయోగించవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది వెదురు. వీటి నుంచి బియ్యం తీసి తినడమే కాకుండా వీటి పిలకలను శరీరం బరువు తగ్గించే ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. సాధారణ వరి బియ్యం మాదిరిగానే వెదురు చెట్లకు పూత వచ్చి కంకులు పడతాయి. వందేళ్లకు ఒకసారి మాత్రమే వెదురు మొక్క పూస్తుంది. అడవుల్లో ఉండే చాలా మంది గిరిజనలు కూడా ఈ వెదురు పువ్వును చూసి ఉండరు. కొన్ని వెదురు జాతులు 50 ఏండ్లకు ఒకసారి పూవు పూస్తుంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెప్తుంటారు. అయితే పూతకు వచ్చి బియ్యం కంకులు వచ్చాయంటే వెదురు మొక్క చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గుర్తట. అలాంటి వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
ఈ బియ్యం తిన్నవారిలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. విటమిన్ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని, బీపీని నియంత్రించడంలో ఈ బియ్యం ఎంతగానో సహాయపడతాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఈ బియ్యం చాలా ఉపయుక్తం. వీటివల్ల సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పుల సమస్యలను దూరం చేసుకోవచ్చు.
వెదురు పిలకను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు చాలా మంది గిరిజనలు. దీనిని బాగా ఉడికించి వంటల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు నీటిలో నానబెట్టి తర్వాత ఆహరంగా తీసుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో పులియబెట్టి వాడుతుంటారు. వెదురు పిలకలో పిండిపదార్థాలు, ప్రోటీన్లతోపాటు కాపర్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి మూలకాలు, రైబోఫ్లెవిన్, విటమిన్ ఏ, కే, ఈ, బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్, ఫైటోన్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు.
ఇదీ చదవండి: Health Benefits of Lemon Juice: ఖాళీకడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..!