Dust Allergy శీతాకాలంలోని డస్ట్ అలర్టీకి ఇంటి చిట్కాలతో చెక్
ప్రతి సీజన్‌లోనూ ఆ సీజన్‌లో ఉన్న వాతావరణంకు అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు వస్తుంటాయి. దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ అలర్జీలను కొన్ని ఇంటి చిట్కాలతో ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో చూడండి.
Dust Allergy: ప్రతి సీజన్‌లోనూ ఆ సీజన్‌లో ఉన్న వాతావరణంకు అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు వస్తుంటాయి. దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఈ డస్ట్ అలర్జీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఎగిసే దుమ్ముకారణంగా డస్ట్ అలర్జీలు ఎక్కువవుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం, ఈ అలర్జీలను కొన్ని ఇంటి చిట్కాలతో ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. అవేంటో చూడండి.
పసుపు పాలు
పసుపును డస్ట్ అలర్జీ లక్షణాలు సహా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేసే ఒక శక్తివంతమైన మసాలా. రాత్రిపూట నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల డస్ట్ అలర్జీ నివారణకు సహాయపడుతుంది.
తులసి ఆవిరి టీ
తులసిలో బయోయాక్టివ్, యాంటీమైక్రోబియల్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. తులసి డస్ట్ అలెర్జీలతో సహా అనేక శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించే పురాతన ఇంటి నివారణ.
తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో మరిగించి, ఆ సారాన్ని ఆవిరి పట్టడం లేదా తులసి టీని తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్, డస్ట్ అలర్జీల సంకేతాలను తొలగిస్తుంది.
నల్ల జీలకర్ర నూనె
నల్ల జీలకర్ర లేదా కలోంజీ అనేది యాంటీమైక్రోబియాల్ ఏజెంట్ల స్టోర్‌హౌస్. ఇది శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్, వాపును అడ్డుకుంటుంది. నల్ల జీలకర్ర నూనె అలెర్జిక్ రినిటిస్‌కు చక్కని మూలికా ఔషధం. ఈ నూనెను ముక్కు, గొంతుపై రోజుకు రెండుసార్లు పూయడం,
మసాజ్ చేయడం వలన నాసికా, నోటి భాగాల డీకంజషన్‌లో సహాయపడుతుంది.
యోగా ఆసనాలు
యోగా అనేక రకల మానసిక, శారీరక అస్వస్థతలను నయం చేసే ఒక గొప్ప థెరపీ. అలర్జీలను నయం చేసే ఆసనాలు కూడా ఉన్నాయి. అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన, సేతుబంధాసన అలర్జీలకు ప్రయోజనకరమైన యోగాసనాలు.
ఇదీ చదవండి: “నువ్వులు”తో నిండు నూరేళ్లు బతకొచ్చు..!