Last Updated:

Taliban rule in Telangana: తెలంగాణాలో తాలిబన్ల రాజ్యమేలుతుంది

అవినీతి గురించి మాట్లాడితే భయమెందుకని, తన పాదయాత్రను ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని, తెలంగాణాలో తాలిబన్ల రాజ్యమేలుతుందిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Taliban rule in Telangana: తెలంగాణాలో తాలిబన్ల రాజ్యమేలుతుంది

YS sharmila: నేడు మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు సంధించారు. ఓ మహిళను ఎదుర్కోలేకి స్పీకర్ కు ఫిర్యాదు చేసారని షర్మిల ఎద్దేవా చేశారు. తనను అవమానించిన వారిపై కేసు పెడితే పోలీసులు స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దద్దమ్మలు తనను ఎద్దుర్కొనలేకే పోలీసు కేసులు పెడుతున్నారని విమర్శించారు. తన పోరాటాన్ని అడ్డుకొనేందుకు ఏకమైన పాలమూరు శాసనసభ్యులు అంతా కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తి చేసేందుకు ఏకమై ఉంటే బాగుంటుందని హితవు పలికారు. ఒకడు మరదలు అంటాడు, మరొకడేమో వ్రతాలు అంటారు, ఓ మంత్రి వ్యాఖ్యలపై నేను మాటలతో ఆగాను, చేతలకు వెళ్లలేదు గుర్తంచుకోండంటూ షర్మిల హెచ్చరించారు.

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిని ఆరెస్టు చేస్తున్నారు. పోలీసు శాఖను కూడా టీఆర్ఎస్ లో విలీనం చేయవచ్చని షర్మిల ఉచిత సలహా ఇచ్చారు. ఆర్ ఎస్ ఎస్ లా టీఆర్ఎస్ కు సైన్యంగా పనిచేయండంటూ భాజాపాను కూడ ఇందులో షర్మిల లాగుతూ ఎద్దేవా చేశారు.

చేసుకొన్నోడికి చేసుకొన్నంత అన్న సామెతలా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఏపీలోని పరిస్ధితులు ఇప్పుడు షర్మిలకు అనుకోకుండా తెలంగాణాలో ఎదురౌడంతో నవ్వుకోవడం పార్టీల వంతైంది.

ఇవి కూడా చదవండి: