Sikkim: ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా సిక్కిం
లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, సిక్కిం "ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం"గా నిలిచింది 100% సేంద్రీయ విధానాన్ని అవలంబించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కింకు ఈ గుర్తింపు లభించింది. పర్యావరణం పై వ్యవసాయం దుష్ప్రభావాల కారణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది.
Sikkim: లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, సిక్కిం “ప్రపంచంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం” గా నిలిచింది 100% సేంద్రీయ విధానాన్ని అవలంబించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కింకు ఈ గుర్తింపు లభించింది.
పర్యావరణం పై వ్యవసాయం దుష్ప్రభావాల కారణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సిక్కిం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ సిక్కిం యొక్క విజయానికి గుర్తింపుగా ఉత్తమ విధానాలకు ఆస్కార్ అవార్డును కూడా ఇచ్చింది.
సేంద్రియ వ్యవసాయం కోసం స్థానిక పంచాయతీల సమూహాలను రూపొందించడం పై ప్రభుత్వం దృష్టి సారించింది. సిక్కింలో, 8 లక్షల 35,000 హెక్టార్ల భూమిలో సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించారు. దీనికోసం 4 లక్షల మంది రైతులకు సహాయం చేశారు. దాదాపు 2,500రైతు సంఘాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా దాదాపు 45 వేల మంది రైతులను సేంద్రియ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. సేంద్రీయ పొలాలు, పాఠశాలలు మరియు నివాసాలను సందర్శించడం ద్వారా ప్రజలకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించారు. పోషకాహారం, పద్ధతులు, తెగులు నియంత్రణ మరియు వ్యవసాయ ప్రయోగశాలల నిర్వహణ చేపట్టారు.