Erra Cheera – The Beginning Release Date: నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ మూవీ బాలనటి బేబీ సాయి తేజస్వీని కీలక పాత్రలో వస్తున్న చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్’. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను మూవీ టీం వాయిదా వేసింది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు మూవీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఎర్రచీరను రిలీజ్ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20న థియేటర్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ బిజినెస్ షో వేశారు. షో చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సినిమా అద్భుతంగా ఉందని తీసుకునేందుకు ముందుకు వచ్చినట్టు ఈ సందర్భంగా డైరెక్టర్ తెలిపారు. ఎర్ర చీర రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మీడియాతో మాట్లాడారు.
“థియేటర్ల రిలీజ్ హడావుడి లేకుండ శివరాత్రికి సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని సూచనల వచ్చాయి. మా సినిమాకు హారర్‌తో పాటు కంటెంట్‌కి కూడా డివోషనల్ టచ్ ఉండటంతో శివరాత్రి రిలీజ్ చేయడం మంచిదని మేకర్స్ కూడా భావించారు. అందుకే ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన మా సినిమాను ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నాం. సినిమా లేట్ కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ ఉందని చూసినవారు అంటున్నారు. మూవీ చూసినవారంత అద్భుతంగా ఉందంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.