Telangana Film Chamber: సంధ్య థియేటర్‌ ఘటన – తెలంగాణ ఫిలిం చాంబర్‌ కీలక ప్రకటన

  • Written By:
  • Updated On - December 23, 2024 / 03:19 PM IST

Telangana Film Chamber: సంధ్య థియేటర్‌ ఘటనలో తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం విరాళలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చింది. కాగా పుష్ప 2 మూవీ రిలీజ్‌ సందర్భంగా డిసెంబర్‌ 4న బెనిఫిట్‌ షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌ థియేటర్‌కి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రాణప్రాయ స్థితిలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై అల్లు అర్జున్‌, థియేటర్ యాజామాన్యంపై కేసు నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఘటనలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఫిలిం ఛాంబర్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్న ఫలిం చాంబర్‌ ఓ పత్రిక ప్రకటన ఇచ్చింది. సంధ్య థియేటర్‌ ఘటనలో మరణించిన రేవతి, అదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి వైద్యానికి, ఫ్యామిలీకి అండగ ఆర్థిక సాయం కోసం విరాళాలు సేకరిస్తున్నట్టు పేర్కొంది. శ్రీతేజ్‌ను ఆదుకునేందుకు సభ్యులు ముందకు రావాలని ఫిలిం ఛాంబర్‌ పిలుపునిచ్చింది.

కాగా ఇప్పటికే శ్రీతేజ్‌ వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం విరాళం ప్రకటించింది. సినిమాటోగ్రాఫర్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యక్తిగతంలో శ్రీతేజ్‌ వైద్యానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు స్వయంగా ఆయన వెళ్లి చెక్‌ అందజేశారు. ఇక అల్లు అర్జున్‌ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. తనవంతుగా రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి అందలేదు.

దీనిపై అల్లు అర్జున్‌పై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇదే ఘటనలో బన్నీపై కేసు నమోదు అవ్వగా పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి జైలుకు కూడా పంపారు. ఒక రాత్రి జైలులో ఉన్న అల్లు అర్జున్‌ మరుసటి రోజు తెల్లవారు జామున బెయిలుపై విడుదలై బయటకు వచ్చారు. అయితే సంధ్య థియేటర్‌న ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్లు బ్యాన్‌ చేస్తున్నట్టు అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.