Last Updated:

Ustaad Bhagath Singh : పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో

Ustaad Bhagath Singh : పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే??

Ustaad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండడం మరో కలిసొచ్చే అంశం. దాదాపు పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి.

తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ ఇవ్వగా.. తాజాగా టైమ్, ప్లేస్ ను అనౌన్స్ చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మే 11న సాయంత్రం 4:59 గంటలకు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35ఎంఎం థియేటర్ లో ఫస్ట్ గ్లింప్స్ ని గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ వార్త మంచి కిక్ ఇచ్చింది అని చెప్పాలి. ఓ వైపు షూటింగ్, మరోవైపు ఎడిటింగ్, మ్యూజిక్ వర్క్ ప్రారంభించి స్పీడ్ పెంచారు. పవన్ ఇచ్చిన కాల్ షీట్లను సరిగ్గా వినియోగించుకుంటూ బెస్ట్ అవుట్ పుల్ అందించేందుకు టీం కృషి చేస్తున్నారు.

 

అదే విధంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ తో #OG, సాయి తేజ్ తో కలిసి చేస్తున్న వినోదాయ సిత్తం ఉన్నాయి.  కాగా రాజకీయాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పవన్ ఇప్పుడు ఈ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సాయి తేజ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2024 ఎలక్షన్స్ లోపు ఈ చిత్రాలన్నీ ముగించేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో బిజీగా ఉన్నాడు.