Last Updated:

ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏవంటే ?

2022 సంవత్సరం డిసెంబర్ మాసానికి వచ్చేశాం. మరో రెండు వారాల్లో ఈ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఈ ఇయర్ ఎండ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి

ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఏవంటే ?

Tollywood : 2022 సంవత్సరం డిసెంబర్ మాసానికి వచ్చేశాం. మరో రెండు వారాల్లో ఈ సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఈ ఇయర్ ఎండ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందు రానున్నాయి. ఈ డిసెంబర్ 2 వ వారంలో థియేటర్ / ఓటీటీ లలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి మీకోసం ప్రత్యేకంగా…

అవతార్ 2 : దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెరూన్ అద్బుత సృష్టికి ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా అవతార్ 2 రానుంది. అవతార్ ను మించి ఈ సినిమా ఉండబోతుందన్న తరుణంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాలో సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

శాసనసభ : దర్శకుడు వేణు మడికంటి తెరకెక్కించిన పాన్ ఇండియన్ చిత్రం ” శాసన సభ “. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నటి సోనియా అగర్వాల్ కీలక పాత్రల్లో నటించగా… ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆక్రోశం : అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆక్రోశం’. దర్శకుడు జీఎన్‌ఆర్ కుమరవేలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పలక్ లాల్వనీ హీరోయిన్ గా చేస్తుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే 16 వరకు ఆగక తప్పదు.

పసివాడి ప్రాణం : అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ” పసివాడి ప్రాణం “. ఎన్‌.ఎస్‌. మూర్తి దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో సీరియల్ నటి సుజిత కీలక పాత్రలో నటించారు. లైవ్‌ కమ్‌ యానిమేషన్‌ టెక్నాలజీతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 16న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ లు :

ఆహా

ఇంటింటి రామాయణం(తెలుగు) – డిసెంబర్ 16

నెట్‌ఫ్లిక్స్

డాక్టర్ జీ(హిందీ) – డిసెంబర్ 11

అరియిప్పు (మలయాళం) – డిసెంబర్ 16

కోడ్‌ నేమ్‌ తిరంగా (హిందీ) – డిసెంబర్ 16

ఇండియన్‌ ప్రిడేటర్‌ : బీస్ట్‌ ఆఫ్ బెంగళూరు(హిందీ) – డిసెంబర్ 16

ది రిక్రూట్‌ (వెబ్‌ సిరీస్‌) – డిసెంబర్ 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఫిజిక్స్‌ వాలా (హిందీ) – డిసెంబర్ 15

డిస్నీ+హాట్‌స్టార్‌

నేషనల్‌ ట్రెజర్‌: ఎడ్జ్‌ ఆఫ్‌ హిస్టరీ(వెబ్‌సిరీస్‌) – డిసెంబర్ 14

గోవిందా నామ్‌మేరా(హిందీ) – డిసెంబర్ 16

ఇవి కూడా చదవండి: