Last Updated:

MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో సీతక్క తడబాటు

రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క తడబాటుకు గురయ్యారు. ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేశారు. ఆనక పొరపాటయింది. మరో బ్యాలెట్ పేపరు అడగటంతో పోలింగ్ అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క వెళ్లిపోయారు. అయితే తను ఓటు వేసే విషయంలో తాను సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నానని అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని,

MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో సీతక్క తడబాటు

Hyderabad: రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క తడబాటుకు గురయ్యారు. ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేశారు. ఆనక పొరపాటయింది. మరో బ్యాలెట్ పేపరు అడగటంతో పోలింగ్ అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క వెళ్లిపోయారు. అయితే తను ఓటు వేసే విషయంలో తాను సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నానని అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని, దీంతో ఓటు చెల్లుతుందో లేదో నన్న అనుమానంతోనే మరో బ్యాలెట్ అడిగానని తెలిపారు.

అయితే దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీతక్క వివరణ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశానని జరుగుతున్న ప్రచారం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి: