Last Updated:

MLA Raja Singh: ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేరా? ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

MLA Raja Singh: ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేరా? ఎమ్మెల్యే రాజాసింగ్

Hyderabad: ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని పై ఆయన ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాసారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చినప్పడు, తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇవ్వొద్దని చెప్పారా.లేక మీరే ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. కొత్త వెహికల్ ఇవ్వకపోతేపాతదాన్ని తీసుకోవాలని ఐజీని కోరారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనడానికి డబ్బుల్లేవా లేకుంటే కేసీఆర్ అనుమతి లేదా అని  ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా, లేకుంటే అధికారులే సైలెంట్‌గా ఉంటున్నారా అని అడిగారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిందని, దాంతో అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు చెప్పారు. నాలుగు నెలల కిందట బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డు మధ్యలోనే ఆగిపోతే రిపేర్ చేయించడానికి ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించాను. రిపేర్ చేసి మళ్లీ తనకు ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పు లేదన్నారు.

నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ రెండు నెలల క్రితం మళ్లీ ఆగిపోయిందని తెలిపారు. దాంతో చేసేదేమీ లేక గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కండీషన్ లో లేకపోవడంతో గోషామహల్ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు వెళ్లలేక పోతున్నట్లు రాజాసింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: