Last Updated:

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు – చర్చనీయాంశంగా మారిన మంచు లక్ష్మి పోస్ట్‌

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు – చర్చనీయాంశంగా మారిన మంచు లక్ష్మి పోస్ట్‌

Manchu Lakshmi Post Viral: మంచు ఫ్యామిలీలో ఆస్తి గోడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. గత మూడు, నాలుగు రోజులుగా మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీ విభేదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తండ్రికొడుకులు పరస్పర ఆరోపణలు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని రొడ్డుకెక్కారు. ఈ క్రమంలో జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్తి తగాదాలు కొట్టుకునేవరకు చేరాయి. ఇలా మంచు ఫ్యామిలీలో గొడవలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

ఈ క్రమంలో మంచు వారి అమ్మాయి లక్ష్మీ ప్రసన్న చేస్తున్న పోస్ట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. నిన్న పీస్‌ అంటూ తన కూతురు వీడియో షేర్ చేసింది. తాజాగా సరికొత్త పోస్ట్‌ పెట్టింది. ఓ రచయిత చెప్పిన కోట్‌ని షేర్‌ చేసింది. ‘ప్రపంచంలోని ఏదీ మీకు చెందనప్పుడు.. ఏదో కోల్పోతామనే భయమెందుకు?’ అంటూ మార్కస్ ఆరెలియస్ రచయిత సందేశాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. మంచు ఫ్యామిలీలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మంచు లక్ష్మి షేర్‌ చేస్తున్న వరుస పోస్ట్స్‌ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న మంచు లక్ష్మి గొడవల నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చింది. కాసేపు తముడు, తండ్రితో మాట్లాడి ఆ తర్వాత వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే మోహన్‌ బాబు నివాసమైన జల్‌పల్లిలో మనోజ్, విష్ణు బౌన్సర్లు పరస్పరం వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు తన ఇంట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అసహనానికి లోనై మోహన్‌ బాబు మీడియా ప్రతినిథిపై దాడి చేశారు.

ప్రస్తుతం అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. మోహన్‌ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్ట్‌ సంఘాలు భారీ ఎత్తున నిరసనకు దిగాయి. ఫిలిం ఛాంబర్‌, మోహన్‌ బాబు ఇంటి ఎదుట బైఠాయించి ఆయనను అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మోహన్‌ బాబుపై రాచకోండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో నిన్న మోహన్‌ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హైబీపీ, గుండె సంబంధిత సమస్యతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కాంటినెంట్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.