Last Updated:

Honey Rose: పోలీసులను ఆశ్రయించిన బాలయ్య నటి హానీ రోజ్‌ – 27 మందిపై కేసు నమోదు

Honey Rose: పోలీసులను ఆశ్రయించిన బాలయ్య నటి హానీ రోజ్‌ – 27 మందిపై కేసు నమోదు

Honey Rose Facing Abusing Comments: నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి హనీ రోజ్‌. ఈ చిత్రంలో ఆమె ఓవర్ నైట్‌స్టార్‌ అయిపోయింది. బాలయ్య సరసన హీరోయిన్‌గా, తల్లిగా నటించిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌. ఆ మధ్య నెట్టింట తెగ హల్‌చల్ చేసిన ఈ మధ్య సైలెంట్‌ అయ్యింది. తరచూ షాపింగ్‌ మాల్స్‌ ఒపెనింగ్‌కి వెళుతూ బిజీ బిజీగా ఉండే హనీ రోజ్‌ తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

సోషల్‌ మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఎర్నాకుళం నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో కుంబళంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను ఎదుర్కొంటున్న వేధింపులు, పోలీసులు కేసుపై హనీ రోజ్‌ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు తమిళంలో ఆమె లేఖ విడుదల చేసింది.

“వివరణాత్మక విమర్శలు, నా లుక్స్పై వేసే కామెడీ జోక్స్‌, మీమ్స్‌ను స్వాగతిస్తా. వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుంది. అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించను. అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వారిపై యద్ధాన్ని ప్రకటిస్తున్నా. నా కోసం మాత్రమే కాదు, మహిళలందరి కోసం నేను పోరాటం చేస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. దీనికి ముందు ఆదివారం సాయంత్రం హానీ రోజ్‌ ఓ ప్రకటన ఇచ్చారు. ఓ వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్టు తన పోస్ట్‌లో చెప్పారు.

“ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడు. నేను అతన్ని పట్టించుకోకుండ సైలెంట్‌గా ఉంటేంటూ ‘ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా?” అని అడుగుతున్నారు. సదరు వ్యక్తి గతంలో నన్ను పలు కార్యక్రమాలకు ఆహ్వానించాడు. కానీ , వేర్వేరు కారణాల వెళ్లేందుకు నిరాకరించాను. దానికి ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్కు రావడం… వీలు కుదిరినప్పుడల్లా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు” అంటూ చెప్పుకొచ్చాడు.